‘క్రిష్‌.. కంగనను ఒంటరిగా వదిలెయ్యండి’

‘క్రిష్‌.. కంగనను ఒంటరిగా వదిలెయ్యండి’

ముంబయి: ‘మణికర్ణిక’ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తే.. క్రెడిట్‌ మొత్తం కంగనే తీసుకుందని దర్శకుడు క్రిష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన సన్నివేశాలనే మరోసారి కంగన తెరకెక్కించి దర్శకురాలినని చెప్పుకొంటున్నారని క్రిష్‌ బాధపడ్డారు. ఈ విషయంపై తాజాగా కంగన సోదరి రంగోలి ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘క్రిష్‌.. ‘మణికర్ణిక’ సినిమా మొత్తం మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకొంటాను. ప్లీజ్‌ ఈ విషయం ఇంతటితో వదిలెయ్యండి. దర్శకత్వం వహించింది మీరే అయినా సినిమాలో తనదే ప్రధాన పాత్ర. ఈ విజయాన్ని కంగనను ఎంజాయ్‌ చెయ్యనివ్వండి. ఆమెను ఒంటరిగా వదిలెయ్యండి‌. మీరు చెప్పినవన్నీ నిజాలేనని నమ్ముతున్నాం’ అని వెల్లడిస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఇమోజీని పోస్ట్‌ చేశారు. శుక్రవారం విడుదలైన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లతో గర్జిస్తోంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ బాక్సాఫీసుల వద్ద ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లను దాటినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. వారంలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఆశిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos