శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ , షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం సంభవించిన‘ ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. సంఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో పరిసరాల్లో చురుగ్గా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.