హాథ్రస్: నగరంలో బుధవారం కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హాథ్రస్లోని నాగ్లా ప్రహ్లదా, నాగ్లా సింఘి ప్రాంతాల్లో బుధవారం జరిగిన జాతరలో స్థానికులు నాటు సార తాగారు. అది కల్తీది కావటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. మద్యాన్ని సరఫరా చేసిన రామహరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతికి కారణాల్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.