మూత్ర పిండాల వైఫల్యం సంకేతాలివే…

మూత్ర పిండాల  వైఫల్యం సంకేతాలివే…

మన శరీరంలోని మలినాలను వెలుపలకు పంపిచండంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడం మూత్ర పిండాల (కిడ్నీలు) విధి. బీపీని కూడా ఇది నియంత్రిస్తూ ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి వాటి కారణంగా కిడ్నీల పని తీరు మందగిస్తుంది. రెండు మూత్ర పిండాలు పాడైతే ప్రాణాలే పోతాయి. కానీ మన శరీరంలోని కొన్ని మార్పుల ద్వారా కిడ్నీలకేదో ప్రమాదం పొంచి ఉంచినట్లు గ్రహించవచ్చు. అవేమంటే…మూత్రం రంగు మారడం. అసాధారణ మార్పులు కనిపించడం. రుచి సామర్థ్యం, ఆకలి తగ్గడం. రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి సమస్యలు. ఆకలి మందగించి బరువు తగ్గడం. కిడ్నీలు పని తీరు బాగా లేకపోతే ముఖం, కాళ్లు వాచినట్లుంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గి శ్వాస సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీలు పాడైనప్పుడు, అవి ఉండే చోట నొప్పి ఎక్కువగా ఉంటుంది. దేనిపైనా ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, తలనొప్పి లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఏడాదికోసారి కిడ్నీల పని తీరును పరీక్షించుకుంటే మంచిది.
కిడ్నీలు చెడిపోవడానికి కారణాలివే…
కిడ్నీలు వాటికంతట అవే చెడిపోవు. మన ఆహారపు అలవాట్ల వల్లే వాటి పని తీరు మందగిస్తుంది. శరీరానికి నీరు చాలా అవసరం. కనుక తరచూ నీరు తాగుతూ ఉండాలి. చాలా మంది పనుల ఒత్తిడి వల్ల చాలా సేపు మూత్రాన్ని ఆపి ఉంచుతారు. దీని వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడి, చెడిపోయే ప్రమాదం ఉంది. అధిక ఒత్తిడికి లోను కాకూడదు. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తీపి పదార్ధాలు పరిమితికి మించి తినకూడదు. మాత్రలను ఇష్టానుసారం తీసుకోవద్దు. వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోవాలి. అధికంగా పని చేయడం కూడా మూత్ర పిండాలపై ఒత్తిడికి కారణమవుతుంది. రోజుకు విధిగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. మధుమేహగ్రస్తులు మూత్ర పిండాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ బీపీ చెక్ చేయించుకుని, అదుపులో ఉంచుకోవాలి. మసాలాలు, కారం, మద్య సేవనం, ధూమపానం…మూత్ర పిండాలకు బద్ధ శత్రువులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos