సంగ్రూర్: ఒక దళితుణ్ని చిత్రహింసలకు గురి చేసి, బలవంతంగా మూత్రాన్ని తాగించిన, మానవతకు కళంక ప్రాయమైన దుర్ఘటన పంజాబ్ రాష్ట్రం, సంగ్రూర్ జిల్లా, చంగానీవాలా గ్రామంలో సంభవించింది. చంగానీవాలా గ్రామ నివాసి జగ్మెయిల్ సింగ్, రింకుల మధ్య పాత వివాదం ఉంది. దాన్ని పరిష్కరించుకుందామని చెప్పి రింకూ, తన మిత్రులు అమర్ జిత్ సింగ్, లక్కీ అలియాస్ గోలి, బీటా అలియాస్ బిందర్లు జగ్మెయిల్ సింగ్ ను ఆయన ఇంటి నుంచి పిలుచుకు పోయారు. కర్రలు, చువ్వలతో కొట్టారు. దప్పిక అవుతుందని, మంచినీళ్లు ఇవ్వమని జగ్మెయిల్ సింగ్ అడిగితే అతనికి మూత్రాన్ని సీసాలో పోసి బలవం తం గా తాగించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకు బయట పడిన జగ్మెయిల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితులు ఫరా రీలో ఉన్నారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ బూటాసింగ్ చెప్పారు.