ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమలో తయారైన తొలికారు విడుదలకు సిద్ధమైంది. ఈనెల 29న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు కియా తొలి కారుకు పరిశ్రమలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేసేలా పరిశ్రమలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ యంత్రాలు ఏర్పాటు చేశారు. పరిశ్రమలో అనంతపురం కార్మికుల చేతుల మీదుగా బిగించిన కియా తొలి కారును సీఎం విడుదల చేసి, డ్రైవ్ చేయనున్నారు. ఇందుకోసం కియా తొలికారుకు పరిశ్రమలో ట్రాక్‌పై ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాక్‌పై సీఎం తొలికారును నడపనున్నందున పరిశ్రమ యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.