ముఖ్యమంత్రి నివాసం వద్ద రైతుల నిరసన

ముఖ్యమంత్రి  నివాసం వద్ద రైతుల నిరసన

చండీగఢ్ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తార్ నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వందలాది రైతులు బారికేడ్లపై నిల్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ మార్కెట్లు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా రైతులు నిరసనలు తెలిపారు. పంజాబ్, హర్యానాలలో వడ్ల సేకరణను అక్టోబరు 11కు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయటాన్ని రైతు నేత రాకేశ్ తికాయత్ ఆక్షేపించారు. వడ్ల సేకరణను సకాలంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ సాధనకు పంజాబ్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఏడాది నుంచి ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos