బీజేపీ ఎంపీకి నాన్ బెయిలబుల్ వారంట్

బీజేపీ ఎంపీకి నాన్ బెయిలబుల్ వారంట్

ఆగ్రా : లోక్సభ సభ్యుడు రామ్ శంకర్ కథేరియాకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. 2009 లో రైలు దిగ్బంధనలు కేసులో నిందితుడైన ఆయన నేటికి కోర్టుకు హాజరు కాకపోవడం ఇందుకు కారణం. ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం కోసం ఆందోళన చేసిన న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26 న రామ్ శంకర్ రైలును నిలిపి వేశారు. 11 సంవత్సరాల కిందట జరిగిన రైలు దిగ్బంధనం కేసులో కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇందిర వర్మ, హైకోర్టు న్యాయవాదుల సంఘర్ష్ సమితి సీనియర్ న్యాయవాది కెడి శర్మ, అరుణ్ సోలంకి, కున్వర్ శైలరాజ్ సింగ్ తదితరులు రైలును నిలిపిన కేసులో నిందితులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos