మణిపూర్‌ హింసను తగ్గించడానికి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏం చేయలేదు

మణిపూర్‌ హింసను తగ్గించడానికి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏం చేయలేదు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఏడాదికి పైగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రచారం చేసుకుంటున్న మోడీ సర్కార్ మణి పూర్లో హింసను తగ్గించడానికి ఏం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు? మణిపూర్ హింసపై తాజాగా ఖర్గే బిజెపిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోసారి మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతూ ఖర్గే బుధవారం ఎక్స్ పోస్టు చేశారు. ‘నరేంద్రమోడీ జీ మణిపూర్ హింసాత్మకంగా మారి 16 నెలలు అవుతోంది. కానీ మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం దానిని తగ్గించడానికి ఏమీ చేయలేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా, అన్ని వర్గాల ప్రజలలో విశ్వాసాన్ని నింపే చర్యలేవీ తీసుకోలేదు.’ అని ఖర్గే పోస్టులో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వాస్తవానికి మణిపూర్ రాష్ట్ర యంత్రాంగాన్ని స్తంభింపజేయడంలో, అసహ్యకరమైన ప్రకటనలు చేయడంలో మణిపూర్ సిఎం ఎన్. బీరెన్ సింగ్ దోషి కాదా? మీడియాలో విడుదలైన ఆ బుల్లెట్ను సిగ్గులేకుండా తప్పించేందుకు రాజీనామా డ్రామా ఆడారు. అయితే అలాంటి వ్యక్తిని సిఎం పదవి నుంచి ఇప్పటికీ ప్రధాని ఎందుకు తొలగించలేదు అని ఖర్గే మోడీని ప్రశ్నించారు.
మణిపూర్లో 16 నెలలుగా హింస జరుగుతున్నా.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ సందర్శించలేదు. ‘రాష్ట్రంలో అడుగు పెట్టడానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ అహం కారణంగా అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. మీ ప్రభుత్వ ర్యాంక్ అసమర్థత, సిగ్గులేనితనం వల్ల అక్కడ శాంతి కోసం నెలకొల్పే ప్రాథమిక చర్యల ప్రక్రియను కూడా ప్రారంభించలేదు అని ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇంఫాల్లో జరిగిన డ్రోన్ దాడి గురించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో క్రౌతుక్ గ్రామస్తులపై ఆదివారం కుకీ తీవ్రవాదులు డ్రోన్లు, బాంబులు, అధునాతన ఆయుధాలతో దాడి చేసిన ఘటనను ఈ సందర్బంగా ఖర్గే గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి చక్రం తిప్పినట్లున్నారు. బిజెపి నాయకుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. అంతర్గత కల్లోలం కాకుండా, ఇప్పుడు జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంది అని ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos