నకిరేకల్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై నకిరేకల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మినీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ జనజాతర సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ‘ఈ ఎన్నికలు భారతరాజ్యాంగ రక్షణ ఎన్నికలు. బిజెపి దళితులు, గిరిజనల రిజర్వేషన్లు తీసివేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కాపాడటానికి చివరి వరకు పోరాటం చేస్తుంది. ఇండియా కూటమీ లక్ష్యం పేదల సంక్షేమమే.10 సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను వారి మిత్రులకి అప్పనంగా కట్టబెట్టారు.ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని ద్వసం చేశారు. మోడి తెలంగాణ కు ఏమి చేశారో ఒక్కటి చూపించాలి. పన్నులు వేసి మిమ్మల్ని దోచుకున్నట్టే ప్రభుత్వాని కూడా దోచుకున్నారు.ఈ 10 సంవత్సరాల్లో పేదరికం, పెరిగింది మహిళా మీద హత్యాచారాలు పెరిగాయి.
పసుపుబోర్డు 05 రోజులో ఏర్పాటు చేస్తమని చెప్పి ఎలక్షన్ లో గెలిచిన ఆయన అది తేవడం మర్చిపోయాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులోన్నే మహిళలకు ఉచ్చిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించటం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు పెంపు గృహాలకు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ 500 లకే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అందించాం. మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తాం . 2024 ఆగస్టు 15వరకు రైతులకు 2 లక్షల రూణమాపి చేస్తాం.ఆటో డ్రైవర్లుకు సంవత్సరానికి 12 వేలు ఇస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 05 న్యాయలను అమలు చేస్తాం. వ్యవసాయ ఆధారిత పనులకు జిఎస్‌టి పూర్తిగా రద్దు చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద రోజువారిగా 400 వందలకు పెంచుతాం. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి మహిళలకు సంవత్సరానికి 1 లక్షల ఇస్తాం. ఈ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ ఉండదు. కెసిఆర్, బిజెపి గురించి ఏమి మాట్లాడటం లేదు.మెడి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే మాటలను మోడి చేస్తుండు. అదాని, అంబానీ మీదికి ఈడీని మోడీ పంపగలడా…?గత ఎన్నికల్లో 15 లక్షలు అకౌంట్ల్లో వేస్తాం అన్నారు, మీకు ఏమైన ఇచ్చారా. అని అడుగుతున్న? మోడి చెప్పెవన్నీ అబద్దాలే..స్వాతంత్య్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి ని , ఎమ్మెల్సి ఎలక్షన్ లో తిన్నార్ మల్లన్నను గెలిపించవలసింది’గా విన్నవించారు.చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను కాంగ్రెస్ పార్టీ నాయకున్ని కాదు సేవకుణ్ణి పార్టీలో ఒక చిన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న నాకు ఎంపి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గంనుండే కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటి వచ్చింది అంటే ఆ ఘనత మీది. బిఆర్‌ఎస్,బిజెపి ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో రాష్టానికి ఏమి చేయలేదు. భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు 2లక్షల రుణ మాఫీ చేస్తని మాట ఇచ్చారు. పార్లమెంట్ లో మీబిడ్డగా ఉండి అధిక నిధులు తీసుకువస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నరేంద్ర మెడికి తెలంగాణ అంటే అస్సలు పట్టదు మన సమస్యలు అంటేనే ఆయన నిమ్మకు నీరు ఏక్కినట్టు ఉంటుంది. మే 13న 3 వ నెంబర్ కి ఓటు వేసి నన్ను గెలిపించాలని మనవి’ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపదాసు మున్షి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ల్ రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున హాజరుఅయ్యారు..