న్యూ ఢిల్లీ : ఇప్పుడు కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు ఏమీ నడవడం లేదని, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ నేతలు చేస్తున్న విమ ర్శలపై గురువారం ఆయన స్పందించారు. ‘కాంగ్రెస్ కుటుంబతత్వం ఏమీ లేదు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దేశం కోసం పనిచేయాలనుకునేవారే. రాజీవ్ గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ అవ్వలేదు. నిజానికి బీజేపీలోనే కుటుంబ తత్వం ఉంది. కానీ వాళ్లను దాచి ఉంచడానికి మాపై బురద చల్లుతున్నారు’’ అని విపులీకరించారు.