తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరినా తెలుగుదేశం పార్టీతో ఉన్న ఎన్నోఏళ్ల అనుబంధాన్ని మాత్రం నామా నాగేశ్వరరావు ఇంకా మరచిపోనట్లు కనిపిస్తోంది.ఏళ్ల తరబడి తెదేపాలో పాతకుపోయిన తెలుగుదేశంలో కీలక సీనియర్ నేతగా ఎదిగిన నామా కొన్ని వేలసార్లు తెలుగుదేశాన్ని ప్రశసించడంతో పాటు ఎన్నికల బరిలో దిగిన ప్రతీసారి తెదేపాకే ఓటు వేయాలంటూ ప్రజలను అడిగి ఉంటారు.ఇక విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం తెదేపా నుంచి తెరాసలోకి మారి ఖమ్మం లోక్‌సభ టికెట్ దక్కించుకున్న నామా నాగేశ్వరరావు కొద్ది రోజులుగా జిల్లా అంతటా ప్రచారాలు చేస్తున్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఓ రోడ్‌షోలో పాల్గొన్న నామా ఎన్నికల్లో సైకిల్ గుర్తకే ఓటు వేయాలని తెదేపాను తప్పకుండా గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.నామా మాటలు విన్న తెరాస నేతలు ఒక్క క్షణం షాక్‌కు గురయ్యారు.అయితే వెంటనే తేరుకున్న నామా క్షమించాలి తెరాసను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేసి తప్పును సరిదిద్దుకున్నాడు.సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని తెదేపా నుంచి తెరాసకు వలస వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు.ఇదే నామా నాగేశ్వరరావు గత ఏడాది డిశెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి తరపున తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.పార్టీ మారినంత మాత్రాన ఎన్నోఏళ్ల పాటు మదిలో గూడుకట్టుకున్న పార్టీ భావజాలం అంత త్వరగా మారుతుందా.నామా ఇంటిపైనున్న కండువా నుంచి తెలుగుదేశం పోయిందేమో కానీ నామా మనసులోనుంచి తెలుగుదేశం ఇంకా పోలేదు.అందుకే యథాలాపంగా తెలుగుదేశానికే ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసి నాలుకు కరుచుకున్నాడు..