పోరుబాటలో కణ్ణన్‌

పోరుబాటలో కణ్ణన్‌

న్యూఢిల్లీ : కశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తిని రద్దు చేసినందుకు నిరసనగా కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్ ఇప్పుడు నూతన పౌర సత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నారు. దుర్భర ఆర్థిక పరిస్థితుల్ని పట్టించుకోకుండా, ప్రజలను విభజించే రాజకీయాలలకు కేంద్రం పాల్పడటం దారుణమని వ్యాఖ్యా నించారు. జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును రెండంకెలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అది ఐదు శాతానికి, ఎస్బీఐ అంచనాల ప్రకారం 4.6 శాతానికి పడిపోయింది. సాధారణ ప్రగతి రేటు 42 ఏళ్ల కనిష్ట స్థాయి 7.5 శాతానికి కూలినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తానన్న మోదీ పాలనలో నిరుద్యోగ సమస్య 49 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుదంది. మెఉనుపెన్నడు లేని విధంగా ఆహార పదార్థాల ద్రవ్యో ల్బణం 14.7 శాతానికి చేరుకున్నా అతీగతీ లేకుండా పోవటం ఘోరమని వ్యాఖ్యానించారు. కన్నన్ గోపీనాథన్ సుడి గాలిలా తిరు గు తూ వివిధ కళాశాలలు, ప్రజా వేదికల్లో ప్రసంగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos