బెంగళూరు : పర్యావరణానికి హాని కలిగిస్తున్నారనే ఆరోపణపై కన్నడ నటుడు యశ్ సినిమాకు బ్రేక్ పడింది. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 చిత్రీకరణ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో జరుగుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని శ్రీనివాస్ అనే వ్యక్తి కేజీఎఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని వాదనలను ఆలకించిన కోర్టు షూటింగ్‌ను ఆపివేయాలని ఆదేశించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడు అధీరా పాత్రలో కనిపించనున్నారు.