‘కేజీఎఫ్‌’కు పాకిస్థాన్‌ ఫిదా..!

  • In Film
  • January 14, 2019
  • 246 Views
‘కేజీఎఫ్‌’కు పాకిస్థాన్‌ ఫిదా..!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా నటించిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి పాకిస్థాన్‌ కూడా ఫిదా అయిపోయంది. పాక్‌లో విడుదలైన తొలి కన్నడ చిత్రమిదే కావడం విశేషం. ఇప్పటి వరకు పాక్‌లో ఏ కన్నడ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ అవకాశం ‘కేజీఎఫ్‌’కు దక్కింది. ‘కేజీఎఫ్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ను లాహోర్‌, ఇస్లామాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 11న పాకిస్థాన్‌ దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు’ అని బెంగళూరుకు చెందిన సినీ విశ్లేషకుడు హరీశ్‌ మాల్యా మీడియా ద్వారా వెల్లడించారు.

పీరియడ్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కర్ణాటకకు చెందిన కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. గత ఏడాది డిసెంబర్‌ 21న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 18 రోజుల్లో రూ.200 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఏ చిత్రమూ ఇన్ని భాషల్లో విడుదల కాలేదు, ఇంత వసూళ్లూ రాబట్టలేదు. ఈ బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos