ప్రభాస్‌ను రెకమండ్ చేసిన యశ్..

  • In Film
  • July 6, 2019
  • 140 Views
ప్రభాస్‌ను రెకమండ్ చేసిన యశ్..

ఒకప్పుడు తన చుట్టూ గీత గీసుకొని అందులోనే ఉండిపోయిన చలనచిత్ర పరిశ్రమలు,నటీనటులు కొద్ది కాలంగా ఒకరితో ఒకరు స్నేహ బంధం కోసం చేతులు చాస్తున్నారు.దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమల మధ్య హద్దులు చెరిగిపోతూ వస్తుండగా ఆయా భాషల నటీనటులు సైతం సొంత చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు ఇతర భాషల నటీనటులతో కూడా చాలా స్నేహంగా మెలుగుతున్నారు.ఈ క్రమంలో శాండల్‌ఉడ్‌ రాకింగ్‌స్టార్‌ యశ్‌కు డార్లింగ్‌ ప్రభాస్‌కు మధ్య కొద్ది కాలంగా స్నేహం బలపడుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో కన్నడలో ఓ స్టార్‌ దర్శకుడు తనకు వినిపించిన కథను విన్న యశ్‌ ఈ కథ తనకంటే ప్రభాస్‌కు బాగా సరిపోతుందని భావించి ప్రభాస్‌ వద్దరే రెకమండ్‌ చేశాడట.ప్రభాస్‌కు స్వయంగా ఫోన్‌ చేసి కథ వినాలంటూ కోరడంతో సదరు దర్శకుడు సంతోషం పట్టలేకపోయాడట.తనకు తానుగా ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించటం అంటే అంత తేలిగ్గా జరిగే పని కాదని కానీ యష్ కు కథ చెప్పటం వల్ల ప్రభాస్‌కు కథ వినిపించే అవకాశం లభిస్తోందని యశ్‌ చేసిన సహాయం గురించి ప్రతీ ఒక్కరికీ గొప్పగా చెబుతున్నాడట ఆ దర్శకుడు. ప్రభాస్‌కు కథ నచ్చి అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల పూర్తయిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos