ఒకేఒక్క సినిమాతో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘటన కచ్చితంగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కే చెందుతుంది.దక్షిణాదిలో అన్ని చిత్రాలు ఏళ్ల క్రితమే వందకోట్ల క్లబ్‌లో అడుగుపెట్టగా కన్నడ చిత్ర పరిశ్రమ మాత్రం అందుకు 2017 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పటివరకు ఒకే తరహాలో సాగుతున్న కన్నడ చిత్ర పరిశ్రమను తట్టిలేపేలా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రాకింగ్‌స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదలై ఘన విజయం సాధించింది.దీంతో దర్శకుడు ప్రశాంత్‌నీల్ పేరు ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగింది.ఈ నేపథ్యంలో ప్రశాంత్‌నీల్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా తీయడానికి అంగీకరించినట్లు సమాచారం.ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రశాంత్ మహేశ్‌బాబు భార్య నమ్రతను కలసి కథను వినిపించినట్లు సమాచారం. ప్రశాంత్ చెప్పిన కథ నమ్రతకు నచ్చిందని బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని పూర్తి కథ వివరిస్తే నచ్చిందంటే తన సొంత బ్యానర్ జీ మహేశ్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లోనే నిర్మించడానికి మహేశ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రశాంత్‌నీల కేజీఎఫ్2 తెరకెక్కిస్తుండగా మహేశ్ బాబు మహర్షి చిత్రీకరణలో ఉన్నారు.మహర్షి అనంతరం అనిల్‌రావి పూడి దర్శకత్వంలో మరొక చిత్రంలో నటించనున్న మహేశ్ 27వ చిత్రంగా ప్రశాంత్‌నీల్ కథలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్‌లో నిర్మించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం..