విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో విమర్శలు,ఆరోపణల పర్వాన్ని ఇప్పట్లో నిలిపేలా కనిపించడం లేదు.కొద్ది రోజులుగా ఎంపీ నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న బాలయోగి ఆస్తులు కాజేశానని అందుకు గర్వపడుతున్నా అని పేర్కొన్న నానీ తాజాగా దొంగకు ఊరందరూ దొంగలే అంటూ మరోమారు బుద్దాపై విరుచుకుపడ్డారు.కేశినేని నానీ తనపై చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ‘నువ్వు చేసినవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలను చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది.’ అని ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ కు నానీ ఇప్పుడు సమాధానం చెప్పారు .కేశినేని ట్రావెల్స్ పై చేసిన వ్యాఖ్యలకు నానీ ఈ రోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.తాను బస్ నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసుంటే, ఫైనాన్స్ చేసిన, వారికి డబ్బులు ఎగ్గొట్టి ఉన్నా, ఈరోజు కేశినేని ట్రావెల్స్ మూతపడే పరిస్థితి వచ్చేది కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ”ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా, ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా, 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి , ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి ఊరందరూ దొంగలులానే కనపడతారు” అని అన్నారు తన ట్వీట్ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు కేశినేని నానీ.తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలతో బుద్దా వెంకన్న ట్వీట్లు చేయడం నిలిపివేసినా కేశినేని నాని మాత్రం ఆదేశాలు లెక్క చేయకుండా బుద్దాపై విరుచుకుపుడుతూనే ఉన్నారు..