టీడీపీకి రాజీనామా

టీడీపీకి రాజీనామా

విజయవాడ : కార్పొరేటర్ పదవికి సోమవారం రాజీనామా అనంతరం కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా చేశానని.. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు. టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేశారని గౌరవం లేని చోట పని చేయలేమని స్పష్టం చేశారు. గత సంవత్సరం కాలం నుంచి టీడీపీ పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. విజయవాడ చుట్టు పక్కన ఉన్న ఒక్క పార్లమెంట్లో కూడా అభ్యర్థి లేరన్నారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామన్నారు.
మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నామని.. తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ అడిగారని.. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు కాక ఇంకెవరికి సంబంధమని ప్రశ్నించారు. కేశినేని నాని మూడవ సారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos