అప్పుడు సవాల్- ఇప్పుడు రాజీనామా

అప్పుడు సవాల్- ఇప్పుడు రాజీనామా

జైపూర్:రాజస్థాన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీనా ఏడు స్థానాలకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ స్థానాల అన్నింటిల్లో బీజేపీ ఓడిపోతే తాను భజన్ లాల్ శర్మ ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని ఎన్నికల సమయంలో కిరోడి లాల్ ప్రకటించారు. రాజస్థాన్లోని మొత్తం 25 సీట్లలో బీజేపీ 14 సీట్లను గెలుచుకుంది.తన కష్టాన్ని నమ్మి ప్రధాని నరేంద్ర మోదీ తూర్పు రాజస్థాన్లోని ఏడు సీట్ల బాధ్యతను అప్పగించారని, ఇందులో అత్యధిక స్థానాల్లో పరాజయం పాలైనందుకే రాజీనామా చేస్తున్నట్లు మీనా ప్రకటించారు. కిరోడి లాల్ 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను అందించారని ఆయన సన్నిహితులు తెలిపారు. తన వాగ్దానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఈ రాజీనామా చేశారని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos