శానిటైజర్ కోసం కక్కుర్తి పడి కంగు తిన్నాడు..

శానిటైజర్ కోసం కక్కుర్తి పడి కంగు తిన్నాడు..

కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతానికి మాస్కులు,శానిటైజెర్లు మాత్రమే దిక్కు కావడంతో కొద్ది రోజులుగా వాటికీ డిమాండ్ పెరిగింది.ముఖ్యంగా శానిటైజర్లకు విపరీతమై డిమాండ్ పెరిగింది.దీంతో అక్కడక్కడా శానిటైజెర్లను దొంగలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.తాజాగా కేరళలో ఓ వ్యక్తి శానిటైజర్ దొంగలిస్తూ కెమెరా కంటికి చిక్కినట్లు తెలుసుకొని అతడు చేసిన పని నవ్వులు పూయిస్తోంది.అందుకు సంబంధిచిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.చేతులను శుభ్రపరచుకునేందుకు శానిటైజర్ లేదని భావించే వారు సమీపంలోని షాపుల వద్దకో లేదా సెలూన్ల వద్దకో వెళుతున్న వేళ, ఇతను మాత్రం విభిన్నంగా ఆలోచించి, ఓ బాటిల్ తీసుకుని, షాపుకు వెళ్లాడు. తాను తెచ్చుకున్న బాటిల్ లోకి దర్జాగా శానిటైజర్ ని నింపుకున్నాడు.ఆపై వెళ్లిపోయే ముందు, ఎదురుగా సీసీ కెమెరా ఉందని గమనించాడు. క్షణం కూడా ఆలోచించకుండా, తన బాటిల్ లోని శానిటైజర్ ను అక్కడున్న మినీ బాటిల్ లో నింపేసి వెళ్లిపోయాడు. అప్పటివరకూ మాస్క్ తీసేసివున్న అతను, సీసీటీవీని చూడగానే, మాస్క్ వేసుకున్నాడు. దీన్ని గమనించిన షాపు యజమాని, దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు.

https://www.facebook.com/watch/?v=2655890081393666&extid=U7NSJ3JP5QojRvnx

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos