ఆడుకోనివ్వడం లేదని అక్కపై కేసు పెట్టించాడు..

ఆడుకోనివ్వడం లేదని అక్కపై కేసు పెట్టించాడు..

కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలు నిరవధికంగా మూత పడడంతో విద్యార్థులంతా ఇళ్లల్లోనే ఉంటూ స్నేహితులతో ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు.అయితే ఓ పిల్లాడు మాత్రం తనతో ఆడుకోవడానికి తన అక్క,స్నేహితురాళ్లు ఒప్పుకోవడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు.పిల్లాడు ఫిర్యాదు చేయడం ఒక ఎత్తయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేయడం ఆసక్తికరంగా మారింది.కేరళకు చెందిన ఎనిమిదేళ్ల ఉమర్‌ నిదర్‌ అనే పిల్లాడు సైతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. లాకఃడౌన్‌ వల్ల పిల్లాడు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అతని స్నేహితులతో ఆడుకోవడం వీలుకాకపోవంతో.. అక్కతో ఆడుకోవాలని చూస్తే వారు ఎగతాళి చేయడంతో ఆందోళన చెందాడు.ఈ విషయాన్ని బాలుడు తండ్రితో చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా అంటే పిల్లాడు నిజంగానే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తన సోదరి, ఆమె స్నేహితులు.. ల్యూడో, షటిల్, దొంగ పోలీసు ఆటలు ఆడుకొంటున్నారని తాను అబ్బాయి కావడం వల్ల తనను వాళ్లతో కలసి ఆడుకోవడానికి ఒప్పుకోవడం లేదని బాలుడు పేర్కొన్నాడు.విద్యార్థి నుంచి ఫిర్యాదు తీసుకున్నాక వెంటనే విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కానీ మరునాడే రావాలని విద్యార్థి పట్టుబట్టడంతో విచారణ చేపట్టారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos