న్యూఢిల్లీ: పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సవరించినందున దేశాన్ని కాపాడాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్య క్షుడు ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ట్వీట్లో భాజపా అధికారంలోలేని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించారు.‘భారత ఆత్మను కాపాడండి’అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. ‘పార్లమెంటులో మెజారిటీ గెలిచింది. ఇక ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధికి ఆవల భారత ఆత్మను కాపాడే బృహత్తర బాధ్యత ఈ చట్టాల్ని అమల్లోకి తెచ్చే 16 మంది బీజేపీ ఇతర ముఖ్య మంత్రులదే. ఇప్పటికే పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర పట్టిక ను వ్యతిరేకించారు. మిగిలిన ముఖ్యమంత్రులూ తమ వైఖరి వెల్లడించే సమయం ఆసన్నమైంద’ని పేర్కొన్నారు. మత ప్రాతిపది కన ప్రజలపై వివక్ష చూపించే సవరణ ముసాయిదాకు మద్దతు ఇవాల్సిన అవసరం ఏమిటని ఆయన జేడీయూ నాయకత్వా న్ని నిలదీశారు. సెక్యులరిజం, గాంధీ సిద్ధాంతాలతో నడుస్తామని చెప్పి పార్టీ నియమావళిలో రాసి ఇలాంటి ముసాయిదాకు మద్దతు ఇవ్వడంలో అర్థం లేదని వాఖ్యానించారు.