కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ నిరసన

న్యూఢిల్లీ : ‘కశ్మీర్ ఫైల్స్’ ఓ బూటకపు సినిమా అని వ్యాఖ్యానించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు బీజేపీ నుంచి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం ఐపీ కళాశాల నుంచి కేజ్రీవాల్ నివాసం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ట్వీట్లో తెలిపింది. కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ దాడి చేసినట్లు ఆరోపించింది. భద్రతా వలయాలు, సీసీటీవీలు, కెమెరాలు, ముందు ద్వారాన్ని విరగ్గొట్టారని తెలిపింది. బీజేపీకి చెందిన ఢిల్లీ పోలీసుల సంపూర్ణ సహకారంతో ఈ విధ్వంసం సృష్టించారని ఆరోపించింది. ఇదంతా కశ్మీరు పండితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసినందుకా? అని ప్రశ్నించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos