న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ముగియాల్సి ఉన్న తరుణంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి సీఈసీ లొంగిపోవడం చూస్తుంటే ఎన్నికల కమిషన్ తన అస్థిత్వం కోల్పోయినట్టు కనిపిస్తోందని అన్నారు. ఈ నెలాఖరులతో సీఈసీ రిటైర్ అవుతుండటంతో ప్రజల మనసుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ”రిటైర్మెంట్ తరువాత ఆయనకు ఏ పోస్ట్ ఆఫర్ చేశారు, గవర్నర్ పోస్టా, రాష్ట్రపతి పోస్టా? ఏ పోస్ట్ కావచ్చు?” అని మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అన్నారు.