న్యూ ఢిల్లీ : నేను ఉగ్రవాదినే. ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించి స్వీటెస్టు టెర్రరిస్టును అయ్యానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలకు స్పందించారు. కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని, పంజాబ్ సీఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నిజంగా వేర్పాటు వాదిని, టెర్రరిస్టుని అయితే.. కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రధాని మోదీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయ లేదు. నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు కాంగ్రెస్, బీజేపీ లు దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, ఒక భాగానికి ప్రధానిని కావాలని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా అని మాటల తూటాలు పేల్చారు. అన్ని పార్టీలు అవినీతిమయం అయ్యాయంటూ విమర్శించారు. ఆప్ను ఓడిం చేందుకు అందరూ కలిసిపోయారని వ్యాఖ్యలు చేశారు. ‘వేర్పాటువాదం’ ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రధాని మో దీ ని కోరారు. ఫిబ్రవరి 20 న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక జరగనుంది. మార్చి 10 న ఫలితాలు వెలువడతాయి.