బెయిల్‌ మరో 7 రోజులు పొడిగించండి

బెయిల్‌ మరో 7 రోజులు పొడిగించండి

న్యూ ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos