సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న మోది

న్యూ ఢిల్లీ : బెంగాల్కి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్ పై ఢిల్లీకి పంపాల్సిందేనని కేంద్రం ఆదేశించినందుకుచడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. ‘బెంగాల్ అధికారుల డిప్యూటేషన్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారలపై అంత తీవ్రంగా జోక్యం చేసుకోవడం సరికాదు. అధికారాలను కేంద్రం గుంజుకుంటోంది. ఎన్నికల ముందు ఇలా ఒత్తిడి పెంచడం అంటే రాష్ట్ర హక్కులకు భంగం కలిగించడమే. సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. ఓ రకంగా ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే అవుతుంద’ని తీవ్రంగా దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos