న్యూఢిల్లీ: భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా భాజపాకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం చేసిన ఒక ట్వీట్లో ఆరోపించారు.’మోదీ, అమిత్ షా ద్వయాన్ని ఓడించాలని యావత్ దేశం కోరుకుంటున్న మయంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలేందుకు కాంగ్రెస్ ఆ పార్టీకి సాయం చేస్తోంది. బీజేపీతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందన్న వదంతులు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తును తిప్పికొట్టేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్తో పొత్తు లేకున్నాబీజేపీకి గట్టి పోటీ ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు షీలాదీక్షిత్ ప్రకటించి నందుకు కేజ్రీవాల్ ఈ మేరకు స్పందించారు.