మనది ఐదు మిలియన్ల కుటుంబం..

  • In Film
  • May 22, 2020
  • 191 Views
మనది ఐదు మిలియన్ల కుటుంబం..

తెలుగులో క్రేజీ హీరోయిన్ల జాబితాలో కీర్తిసురేశ్‌కు అగ్రస్థానం దక్కుతుంది.మిగిలిన హీరోయిన్ల విధంగా అందాల ప్రదర్శన చేయకపోయినా కీర్తిసురేశ్‌కు కుర్రకారులో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది.ఇక మహానటి చిత్రంలో సావిత్రిని తలపించి మరోస్థాయికి చేరుకుంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటగా, సందర్భంగా అభిమానులను ఉద్దేశించి వీడియో తయారు చేసి పోస్ట్ చేసింది. వీడియోలో కీర్తీ సురేశ్ మేకప్ లేకుండా కనిపించడం గమనార్హం. తన పెట్ డాగ్ తో కలిసి వీడియోను రూపొందించింది. మనది ఇప్పుడు 50 లక్షల మందితో నిండిన కుటుంబమని, తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం కీర్తి, ‘పెంగ్విన్‘, ‘మిస్ ఇండియా‘, ‘రంగ్ దేతదితర చిత్రాల్లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి మాత్రం సినిమాల షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు నిలిచిపోగా, నిబంధనలు తొలగిపోగానే కీర్తి బిజీ కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos