స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను   కేసీఆర్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. పర్యటనలో సీఎం వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌ కుమార్ కూడా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos