వెనక్కి తగ్గిన కేసీఆర్‌..

వెనక్కి తగ్గిన కేసీఆర్‌..

నాకు నచ్చిందే చేస్తానన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో మీడియా పుణ్యమా అని.. తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకవటమే కాదు.. మార్చుకోవటం కూడా ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి ప్రతి పార్టీ తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదే తీరులో తాజాగా టీఆర్ ఎస్ సైతం తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటించింది.ఈ జాబితాలో తెరాస పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం చివరకు పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో కూడా కీలకపాత్ర పోషించిన హరీశ్‌రావుకు స్థానం దక్కకపోవడం ప్రతీఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఇప్పటికే మంత్రి పదవి లేకుండా చేయటమే కాదు.. పార్టీలోనూ కీలక స్థానం ఇవ్వకుండా.. నామ మాత్రంగా మారుస్తున్న వైనం.. అంతకంతకూ ప్రాధాన్యత తగ్గిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీన్ని మరింత పెంచేలా స్టార్ట్ స్టేటస్ ఇవ్వని తీరు మీడియాలో హైలెట్ అయ్యింది.నిన్నగాక మొన్న రాజ్యసభలో అడుగుపెట్టిన సంతోష్‌కుమార్‌ను సైతం స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో చేర్చిన కేసీఆర్‌ హరీశ్‌రావును పూర్తిగా పక్కనపెట్టడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో కేసీఆర్ రియాక్ట్ కావటమే కాదు.. స్టార్ క్యాంపైనర్ గా హరీశ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను అనుకున్నదే తప్పించి.. వేరే వారు చెప్పింది చేయటానికి తాను లేనన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. అందుకు భిన్నంగా హరీశ్ ఎపిసోడ్ లో మాత్రం వెనక్కి తగ్గారని చెప్పక తప్పదు. ఫర్లేదు కేసీఆర్ సైతం.. వెనకడుగు వేస్తారన్న మాట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos