ప్రధానమంత్రి పదవికి కేసీఆర్ అర్హులు..

ప్రధానమంత్రి పదవికి కేసీఆర్ అర్హులు..

దేశానికి ఎవరు
ప్రధాని అయితే ఉత్తమమో ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రధాని అయితే భారతదేశానికి ఉత్తమమంటూ కితాబిచ్చారు
ఓవైసీ.ప్రధాన మంత్రి పదవిని అధిష్టించడానికి కేసీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఓవైసీ
తెలిపారు. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని అన్ని రాష్ట్రాల స్థానిక పార్టీలన్నీ
కలసి ఏర్పడ్డ కూటమి అధాకారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నరాఉ.ఈ కూటమికి కేసీఆర్‌ నాయకత్వం
వహించి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి ప్రధానమంత్రి పీఠం అధిష్టించాలని కోరుకుంటున్నామన్నారు.జాతీయ
పార్టీలకు చెందిన నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ ప్రధానమంత్రి పదవికి అనర్హులని
స్థానిక పార్టీలకు చెందిన నేతలే ప్రధానమంత్రి పీఠం అధిష్టిస్తే దేశానికి ఉత్తమమన్నారు.లోక్‌సభ
ఎన్నికల్లో తెరాసకు 16 సీట్లు దక్కితే దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ తప్పకుండా కీలకంగా
మారతారన్నారు.ఇక కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూడాల్సిన
బాధ్యత మాపై కూడా ఉందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos