విశాఖ పర్యటన రద్దు చేసుకున్న కేసీఆర్‌…

విశాఖ పర్యటన రద్దు చేసుకున్న కేసీఆర్‌…

మంత్రివర్గ విస్తరణ,బడ్జట్‌ రూపకల్పన తదితర కీలక నిర్ణయాలు,సమావేశాల దృష్ట్యా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేశఖరరావు విశాఖపట్టణం పర్యటన రద్దు చేసుకున్నారు.విశాఖలో
శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలంటూ నిర్వాహకుల ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్‌
వార్షికోత్సవాల్లో ముఖ్యఅథిధిగా హాజరుకావడానికి అంగీకరించారు.అయితే ఈనెల 17వ తేదీ నుంచి
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులతో సమావేశాలు,క్షేత్రస్థాయి
పర్యటనలకు సంబంధించి గురువారం కేసీఆర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.అందులో
రాష్ట్రానికి రానున్న కేంద్ర ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదికల తయారీతో పాటు రాష్ట్ర
బడ్జెట్‌కు రూపకల్పనపై కూడా చర్చించనున్నారు.ఇక తెలంగాణలో గులాబీ నేతలో ఎప్పటినుంచో
ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారని
ఇదేనెల 15వ తేదీన లేదా మరో పక్షం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.15వ
తేదీ శుక్రవారం దశమి మంచి ముహూర్తం కావడంతో అదేరోజునే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని
పార్టీ శ్రేణుల్లో చర్చలు జరుగుతున్నాయి.ఇదేనెల17వ తేదీన కేసీఆర్‌ పుట్టినరోజు కూడా
కావడంతో రెండురోజుల ముందే మంత్రివర్గ విస్తరణ తప్పకుండా ఉంటుందని నేతలు కూడా భావిస్తున్నారు.తాజాగా
విశాఖ పర్యటన రద్దు కూడా మంత్రివర్గ విస్తరణపై వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుస్తోంది.ఇక
విశాఖ పర్యటనకు కేసీఆర్‌ బదులు ప్రశాంత్‌రెడ్డి వెళ్లనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos