తీహార్ జైలులో కవితను క‌లిసిన‌ హరీశ్‌ రావు

తీహార్ జైలులో కవితను క‌లిసిన‌  హరీశ్‌ రావు

న్యూ ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఉదయం కలిశారు. ఈ దర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితను కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos