కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

న్యూ ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో అరెస్టై, తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి నాలుగు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos