బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్

బీఆర్ఎస్  నుంచి కవిత సస్పెన్షన్

హైదరాబాదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.”పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos