అమ్మాయిలను చూస్తే అదొక్కటే గుర్తొస్తుందా?

  • In Film
  • January 20, 2020
  • 175 Views
అమ్మాయిలను చూస్తే అదొక్కటే గుర్తొస్తుందా?

స్మార్ట్‌మొబైళ్లు,సామాజిక మాధ్యమాల వల్ల మనుషుల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది.ఒకప్పుడు సినీ తారలను చూడడమే గొప్పగా భావించగా సామాజిక మాధ్యమాల ప్రవేశించాక సినీ తారలతో నేరుగా మాట్లాడడం వీలైతే పోట్లాడే స్థాయికి చేరుకుంది.ఇలా నెటిజన్ల బారిన పడుతున్న సెలెబ్రిటీల్లో సినీతారలే ముందువరుసలో ఉంటారు.అన్ని చిత్ర పరిశ్రమల తారలు నెటిజన్ల ట్రోల్స్‌ ఎదుర్కొన్నవారే.తాజాగా నటి కస్తూరి కూడా ఇలాని అనుభవమే ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ అజిత్ అభిమాని అయిన ఓ నెటిజన్.. కస్తూరిని టార్గెట్ చేస్తూ దుర్భాషలాడాడు. ఈ కామెంట్స్ చూసిన కస్తూరి ఆగ్రహానికి లోనైందిఅజిత్ లాంటి సూపర్ స్టార్ అభిమానిని అని చెప్పుకుంటూ తన క్యారెక్టర్ పై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. వెంటనే ఆ ట్వీట్ కి బదులిస్తూ.. ‘మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు.. కానీ ఇలా అజిత్ అభిమానినని చెప్పుకుంటూ ఆడవాళ్ల మీద నీచమైన కామెంట్స్ చేసే ఇలాంటి వాళ్లని ఏమనాలి..? అని ప్రశ్నించింది. మీకు అమ్మాయిలు సెక్స్ కోసమే కావాలంటే.. బయటకి వెళ్లడం ఎందుకు..? ఇంట్లో మీ అక్కనో, అమ్మనో అడగండి అంటూ ఘాటుగా బదులిచ్చింది.అంతేకాదు.. ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్స్ చేస్తున్న వారిపై ట్విట్టర్ చెర్యలు తీసుకోవాలని కోరారు. dirtyajithfans అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఇది చూసిన అజిత్ ఫ్యాన్స్ కొంతమంది dirtykasturiaunty అంటూ కస్తూరిని టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన కస్తూరి.. తప్పు చేసిన వారిని కంట్రోల్ చేయాల్సిందిపోయి వారితో చేతులు కలిపి దిగజారిపోతున్నారంటూ మండిపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos