పీవోకెలో కబ్జాను ఖాళీ చేయమనండి

పీవోకెలో కబ్జాను ఖాళీ చేయమనండి

న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఆ దేశ ఆక్రమణ అంశాన్ని ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ శుక్రవారం ఇక్కడ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. అలాగే భారత్లో హువావే 5జీకి స్థానం లేదనీ స్పష్టీకరించాల న్నారు. ‘అధికరణ 370 రద్దు చేసినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్కు జిన్పింగ్ మద్దతిచ్చారు. మహాబలిపురంలో భేటీలో మీ 56 అంగుళాల ఛాతి చూపి పీవోకే ప్రాంతంలో చైనా ఆక్ర మిం చుకున్న 5000 చ.కి.మీ భూ భాగాన్ని వదిలి వెళ్లమని చెప్పండి. భారత్లో హువావే 5జీకి స్థానం లేదని తేల్చి చెప్పండ’ని ట్వీట్ చేశారు. లేదంటే ‘మీరు(మోదీ) చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని ప్రజలు భావిస్తారు’ అని హెచ్చరించారు. జిన్పింగ్, మోదీ మధ్య రెండో అనధి కారిక భేటీ శుక్రవారం మహాబలిపురంలో జరగనుంది. భారత అంతర్గత అంశమైన కశ్మీర్లోని పరిస్థితులపై జిన్పింగ్ మాట్లాడినందున హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనపై మోదీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా చైనాను నిలువరించడంలో మోదీ ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos