కశ్మీర్ ఎన్నిక ల్లో వెనుకబడిన కమలనాధులు

కశ్మీర్ ఎన్నిక ల్లో వెనుకబడిన కమలనాధులు

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో ఫారూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్ల రేషన్ (పీఏజీడీ) భాజపా కంటే ముందుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు. ఫలితాలు విడుదలవుతున్న మొదట్లో భాజపా ఆధిక్యంలో కనిపించింది. లెక్కింపు జరుగుతున్నాకొద్ది పీఏజీడీ గణనీయంగా పుంజుకుంది. మొత్తం 20 జిల్లాలోని 280 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శ్రీనగర్ డివిజన్లో 113 స్థానాలకు గాను 67 స్థానాల్లో పీఏజీడీ కూటమి గెలుపునకు దగ్గరలో ఉంది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 28, పీడీపీ 25 అభ్యర్థులు ఉన్నారు. ఇ జమ్మూ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ బీజేపీకి గుప్కార్ కూటమికి మధ్య నువ్వా-నేనా అనే పోటీ కొనసాగుతోంది. శ్రీన గర్ డివిజన్లో కేవలం 3 స్థానాల్లో మాత్రం భాజపా ప్రభావం కనబడుతోంది. జమ్మూ ప్రాంతంలోని మొత్తం 108 స్థానాల్లో భాజపా 53 స్థానాల్లో ఆధి క్యంలో ఉంది. 20 జిల్లాల్లోని 280 స్థానాలకు నవంబర్ 28, డిసెంబర్ 19న మధ్య ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరిగాయి. 51 శాతం మంది (57 లక్షలు) మంది ఓట్లు వేసారు. రాజ్యాంగంలో 370 అధీకరణ నిర్వీర్యం తర్వాత ఇవే తొలి ఎన్నికలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos