వారణాశి: ప్రధాని మోదీ
శుక్రవారం ఉదయం హిందువుల పవిత్ర
పుణ్యక్షేత్రం కాశీలో విశ్వేశ్వరునికి స్వయంగా హారతి పట్టారు.ప్రత్యేక
పూజలు చేసారు. ఆయన వెంట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా రాష్ట్ర
సమితి అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే తదితరులు ఉన్నారు. కాశీ విశ్వనాథుని ఆలయ విస్తరణ,సుందరీకరణ పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం కాన్పూర్, ఘజియాబాద్లలో
పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు.