కశ్మీర్‌లో ప్రశాంతంగా ప్రార్థనలు

కశ్మీర్‌లో ప్రశాంతంగా  ప్రార్థనలు

శ్రీనగర్: జమ్ము-కశ్మీర్లో సోమవారం బక్రీద్ పర్వదినాన ముస్లింల ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి.మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముస్లంలు మసీదుకు గుంపులుగా రాకుండా బారికేడ్లో పోలీసులు నియంత్రించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి ప్రదర్శనల నిర్వహణకు అనుమతించ లేదు. రేషన్ దుకాణాల్లో సరకులు, ఏటీఎంలలో డబ్బులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీనగర్లో ముస్లింలకు పోలీ సులు శుభాకాంక్షలు తెలిపారు. ఆలింగనం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.న్యూ ఢిల్లీ లోని ప్రముఖ జామా మసీద్లోజరిగిన ప్రార్థనల్లో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు. ముంబైలో స్థలా భావం వల్ల రహదార్ల పైనే ప్రార్థనలు చేసారు. భోపాల్లో బక్రీద్ ప్రార్థనల్లో కాంగ్రెస్ సీని యర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. దేశప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పట్నా, హైదరా బాద్, బెంగళూరు సహా ప్రముఖ నగరాల్లో జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos