న్యూఢిల్లీ : కరోనాకు ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ముగ్గురు ఈ వ్యాధితో కన్నుమూసినట్లయ్యింది. ఇప్పటి వరకూ కే దిల్లీ, బెంగళూరుకు చెందిన ఇద్దరు ఇదే వ్యాధితో మృతి చెందారు. ఇప్పటి వరకూ 125 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.