అమరావతి: గత 24 గంటల్లో కొత్తగా 71 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ గురు వారం ఇక్కడ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 321 మంది కోలుకుని విడుదలయ్యా రు. 31 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న వారి సంఖ్య 1,051 దాఖలైంది.