సంతకం ఫోర్జరీ చేశాడంటూ మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లెపై విచారణ చేపట్టాలంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతో 1999వ సంవత్సరంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న చేతనా రామతీర్థను అనిల్‌కుంబ్లె రెండవ వివాహం చేసుకున్నాడు. కాగా 1986లో కుమార్ వి. జాగిర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న చేతన రామతీర్థకు అరుణి అనే కుమార్తె పుట్టింది.వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న అనంతరం అనిల్ కుంబ్లెతో పాటు చేతన,తరుణి కూడా ఉండసాగారు.అయితే తనకు,చేతనాకు జన్మించిన అరుణి… తన కుమార్తె అంటూ అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చేతన మొదటి భర్త కుమార్ ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పాస్ పోర్ట్ అధికారులకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కుమార్ పిటిషన్ ని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బి. వీరప్ప నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ అనిల్ కుంబ్లే మీద చర్యలు తీసుకోవాలని కోరమంగళ పాస్ పోర్టు కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద పూర్తి విచారణ చేసి ఆ వివరాలని కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది..