‘కృష్ణ’లో సీమ వాటాకు శాసనం చేయాలి

‘కృష్ణ’లో సీమ వాటాకు శాసనం చేయాలి

హైదరాబాద్: గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు కేటాయించాలని గ్రేటర్ రాయలసీమ నేతలు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శనివారం రాసిన లేఖలో విన్నవించారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ఎంవీ, ఆంజనేయరెడ్డితో పాటు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేశ్రెడ్డి సీఎంకు లేఖ రాసిన వారిలో ఉన్నారు. ‘రాయలసీమకు గోదావరి జలాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం అభినందనీయం. ఈ ప్రకటనపై సీఎం జగన్ చొరవ తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు కేటాయించి చట్టబద్ధత కల్పించాలి. . బ్రిజేష్ కుమార్ న్యాయ పంచాయతి తీర్పు పై అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉంది. .ఆ తీర్పు రాయలసీమ మెడపై కత్తిలాంటిది. తెలుగు గంగకు 25 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా కేటాయించలేదు. ఆ తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిరర్థక మవుతాయి. గోదావరి జలాలు మళ్లించడమే దీనికి తగిన ప్రత్యామ్నాయం. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించడం తప్ప మరో దారి లేదు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు గత రెండేళ్లుగా తరలిస్తున్నందున ఆ మేరకు కృష్ణా జలాలు ఆదా అవుతున్న మాట వాస్తవమే. ఆదా అవుతున్న కృష్ణా నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించే శాసనం చేయాల’ని డిమాండ్ చేశారు. >

తాజా సమాచారం

Latest Posts

Featured Videos