యడ్యూరప్ప మరో ప్రయత్నం విఫలం

యడ్యూరప్ప మరో ప్రయత్నం విఫలం

బెంగళూరు..అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముంగిట బోల్తా పడిన బీజేపీకి మరో సారి శృంగ భంగం ఎదురైంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని తొలి ప్రయత్నంలో విఫలమైన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్పకు రెండో సారి కూడా చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి పెద్ద సంఖ్యలోకాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైరుహాజరవుతారని యడ్యూరప్ప ఆశించగా 80 మందికి గాను 76 మంది హాజయ్యారు. దీంతో మరోసారి సీఎం ఆవుదామనే యడ్యూరప్ప ఆశలు అడియాసలయ్యాయి. ఈ పరిణామంతో హర్యానాలోని గురుగ్రామలో గత వారం రోజులుగా ఓ రిసార్టులో బస చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరుకు తిరిగి వచ్చేయాలని పార్టీ ఆదేశించింది. మరో వైపు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలు తెలపాల్సిందిగానలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్లు సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos