కాన్పూర్: గంగాఘాట్ తరహాలోనే ఇక్కడి శివరాజ్పుర్ ఖేరేశ్వర్ ఘాట్ ప్రాంతంలో శుక్రవారం కుప్పలు తెప్పలుగా మృత దేహాలు బయట పడ్డాయి. వర్షం వల్ల పై పొర మట్టి కొట్టుకుపోవటంతో ఖననం చేసిన శవాలన్నీ ఒక్కసారిగా కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఆ శవాలను మళ్లీ ఖననం చేశారు. కాన్పుర్లో రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్కు బలవుతున్నారు. వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్థలం కరవైంది. కాన్పుర్లోని విద్యుత్ స్మశాసన వాటికలో చోటు దొరకడం లేదు. శివరాజ్పుర్ ఖేరేశ్వర్లో చితికి కట్టెలు లేక మృతదేహాలను ఖననం చేస్తున్నారు.