బెంగళూరు : కేరళలో ఆలయాల దర్శనానికి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు చేదు అనుభవం ఎదురైంది. మంగ ళ వారం ఉదయం కణ్నూరులో ప్రవేశించిన ఆయనకు విద్యార్థి సంఘం కార్యర్తలు నల్ల జెండాలతో నిరసించి వాహన శ్రేణి ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మంగ ళూ రు లో జరిగిన నిరస ప్రదర్శన సమాచార సేకరణకు కేరళ నుంచి వచ్చిన తొమ్మిది మంది మలయాళం పత్రికల విలేఖ రుల్ని కర్నాటక పోలీసులు అక్రమంగా కొన్ని గంటల పాటు బంధించారు. ఇందుకు ప్రతీకారంగా యడ్యూరప్ప వాహన శ్రేణి కదలికకు కేరళ విద్యార్థులు అవరోధాన్ని కల్పించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నందున యడ్యూరప్ప గతంలో నిర్ణ యించినట్లు బుధవారం పలు ఆలయాల దర్శనానికి వెళ్లకుండా మంగళవారమే ఇంటి ముఖం పట్టారు.