రాహుల్‌ వ్యాఖ్యలో తప్పేమిటి?

రాహుల్‌ వ్యాఖ్యలో తప్పేమిటి?

న్యూ ఢిల్లీ : రేప్ ఇన్ ఇండియా అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చట్ట సభ వెలుపల చేసిన వ్యాఖ్యల్ని సభలో ఎలా ఉల్లేఖిస్తారని డీఎంకే నేత కనిమొళి శుక్రవారం లోక్సభలో పాలక పక్ష సభ్యుల్ని నిలదీశారు. గతంలో తాము ఇలాంటి ఉదంతా లను ప్రస్తావించినపుడు సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదంటూ తమకు అనుమతి నిరాకరించారని వివరించారు. ‘ప్రధాని మోదీ నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారు. దాన్ని మేము గౌరవిస్తాం. వాస్తవంగా దేశంలో జరుగుతున్న దేమిటి? రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదే. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగిక దాడులు మాత్రం జరుగుతున్నాయని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంద’ని కనిమొళి వివ రించారు. దీన్నీ  స్మృతి  ఇరానీ ఆక్షేపించారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలకు అతీ తంగా వ్యవహ రించ లేక పోతున్నారన్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos